ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''అమరావతిలో తితిదే క్యాంపు కార్యాలయం లేదు'' - camp office in Tadepalli

అమరావతిలో తితిదే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయటం లేదని ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తనకు తెలియకుండా వెలువడిన ఉత్తర్వులపై విచారణ చేపడుతున్నట్టు చెప్పారు.

తితిదే  ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

By

Published : Jul 18, 2019, 2:47 AM IST

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

అమరావతిలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడంపై వస్తున్న వివాదం మీద.. తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఆరుగురు ఉద్యోగులతో పాటు మౌలిక వసతులతో కూడిన క్యాంపు కార్యాలయాన్ని తాడేపల్లెలో ఏర్పాటు చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం తితిదే ఉత్తర్వులు వెలువరించడంపై.. తనకేమీ తెలియదన్నారు.ఈఉత్తర్వులు ఎలా వెలువడ్డాయన్న విషయంపై.. విచారణ నిర్వహిస్తామని తెలిపారు. శ్రీవారి నిధులను దుర్వినియోగం చేయబోమని... తన వ్యక్తిగత అవసరాలకు సొంత డబ్బే వినియోగిస్తానని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details