ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TTD : తితిదే క్యాలెండర్లు, డైరీల బ్లాక్‌ మార్కెటింగ్‌ - తూర్పుగోదావరి జిల్లా నేర వార్తలు

దేశవ్యాప్తంగా డిమాండ్‌ కలిగిన తితిదే 2022 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను (TTD Calendars and Diaries -2022)ఓ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన మోహన్‌ పబ్లికేషన్స్‌ సంస్థ దేవుళ్లు.కామ్‌ (www.devullu.com)పేరుతో వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో తితిదే క్యాలెండర్లు, డైరీలను అధిక ధరలకు అమ్ముతోంది.

TTD
తితిదే క్యాలెండర్లు, డైరీల బ్లాక్‌ మార్కెటింగ్‌

By

Published : Oct 29, 2021, 9:22 AM IST

దేశవ్యాప్తంగా డిమాండ్‌ కలిగిన తితిదే 2022 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను (TTD Calendars and Diaries -2022) ఓ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన మోహన్‌ పబ్లికేషన్స్‌ సంస్థ దేవుళ్లు.కామ్‌ (www.devullu.com)పేరుతో వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో తితిదే క్యాలెండర్లు, డైరీలను అధిక ధరలకు అమ్ముతోంది. రూ.130 విలువ చేసే క్యాలెండర్‌ను రూ.198, రూ.130 విలువైన డైరీని రూ.243కు ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ప్రైవేటు సంస్థల ద్వారా తితిదే విక్రయాలను చేపట్టదు. మోహన్‌ పబ్లికేషన్స్‌ అనుమతి లేకుండానే బ్లాక్‌మార్కెటింగ్‌ చేస్తుండటంతో తితిదే ప్రింటింగ్‌ అండ్‌ ప్రెస్‌ (TTD Printing and Press) ప్రత్యేకాధికారి రామరాజు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై తితిదే విజిలెన్స్‌ విభాగం విచారణకు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details