తిరుమలలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరుగుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్ కుమార్, భార్గవి పాల్గొన్నారు.
ఇతర సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. తితిదే భూముల వేలం ప్రతిపాదనపై వివాదం, ఇతర కీలక అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.