అన్నమయ్య భవన్లో.. తితిదే ధర్మకర్తల మండలి సమావేశం - తితిదే ధర్మకర్త మండలి న్యూస్
తిరుమల అన్నమయ్య భవన్లో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం కొనసాగుతోంది. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న మండలి రెండో సమావేశంలో అజెండాలోని 44 అంశాలపై చర్చించనున్నారు.
తిరుమల అన్నమయ్య భవన్లో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా తిరుపతిలో గరుడ వారధి నిర్మాణానికి తితిదే నిధుల కేటాయింపు, తిరుమల తాగునీటి అవసరాల కోసం బాలాజీ జలాశయం నిర్మాణానికి ఆర్థికసాయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న స్విమ్స్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో తితిదే పరిధిలోకి తీసుకురావడం, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఉన్న బ్యాక్‌లాగ్ పోస్ట్‌ల భర్తీ వంటి కీలక అంశాలకు సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటితోపాటు తితిదే ప్రజాసంబంధాల అధికారికి చీఫ్ పీఆర్‌వోగా పదోన్నతి కల్పించడంతో పాటు ధర్మకర్తల మండలి ఛైర్మన్‌కు ప్రత్యేకంగా పీఆర్ వోను నియమిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేయనున్నారు. తితిదే పరిధిలో ఉన్న హిందూ ధర్మప్రచార పరిషత్ ఛైర్మన్ నియామకంపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.