ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బంగారు నగల వివరాలు ఆన్‌లైన్‌లో పెడితే సమస్యలొస్తాయి' - తితిదే ఆస్తుల పరిరక్షణపై కమిటీ

తితిదే ఆస్తులను పరిరక్షించాలని దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ ముగిసింది. శ్రీవారి ఆస్తులపై తొమ్మిది మంది సభ్యులతో కమిటీ వేసినట్లు తితిదే ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.

Ttd assets Petetion hearing in highcourt
తితిదే ఆస్తులపై హైకోర్టులో విచారణ

By

Published : Mar 16, 2021, 10:03 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను పరిరక్షించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. రిటైర్డ్‌ జస్టిస్‌ శ్రీధర్‌రావు నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో పరిరక్షణ కమిటీ వేశామన్న తితిదే...శ్రీవారి ఆస్తులను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. బంగారు నగల వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టాలని న్యాయవాది బాలాజీ కోరారు. దీనిపై స్పందించిన తితిదే...నగల వివరాలు ఆన్‌లైన్‌లో పెడితే సమస్యలు వస్తాయని వెల్లడించింది.

గతంలో జస్టిస్‌ జగన్నాథరావు అధ్యక్షతన కమిటీ వేశామన్న తితిదే...ఆ కమిటీ సూచనలను పాటిస్తున్నట్లు వివరించింది. తితిదే ఆస్తులను భవిష్యత్తులో అమ్మకానికి పెట్టబోమని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details