ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tirumala: శ్రీవారి దర్శన తేదీ మార్చుకునే అవకాశం.. ఏడాదిలో ఒక్కసారే - ఏపీ తాజా వార్తలు

కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పొందిన భక్తులు వారి దర్శన తేదీని మార్చుకోవచ్చని వెల్లడించింది. ఏడాది సమయంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని తెలిపింది.

TTD
devotees to change date of tirumala darshan

By

Published : Jun 6, 2021, 5:44 PM IST

తిరుమల శ్రీవారి (Tirumala) దర్శన టికెట్లు పొందిన భక్తులు వారి.. దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు కల్పిస్తూ తితిదే (TTD) నిర్ణయం తీసుకుంది. టికెట్లు పొందినప్పటికీ.. కరోనా ప్రభావంతో స్వామివారి దర్శనానికి రాలేకపోతున్నట్లు గుర్తించింది. ఫలితంగా జూన్ 30వ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పొందిన యాత్రికులు వారి దర్శన తేదీని మార్చుకోవచ్చని తితిదే ప్రకటించింది. ఏడాది సమయంలో ఎప్పుడైనా దర్శన సమయాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించిన అధికారులు.. ఒక్కసారి మాత్రమే మార్పునకు ఈ అవకాశం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details