కరోనా ప్రభావంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుండడంతో తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. గత వారం రోజుల్లో కొవిడ్ కేసులు అధికంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి యాత్రికుల రాక భారీగా తగ్గుతోంది. టిక్కెట్లు పొందినవారిలో దాదాపు 30 శాతం మంది.. స్వామివారి దర్శనానికి రావడంలేదు. దీంతో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి తితిదే నూతన వెసులుబాటు కల్పించింది.
ఈ నెల 21 నుంచి 30 వరకు టిక్కెట్లు కలిగినవారు 90 రోజుల్లో ఎప్పుడైనా స్వామివారి దర్శనానికి రావొచ్చని ప్రకటించింది. దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని తితిదే విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చేభక్తులు కొవిడ్ నియమాలు పాటించాలని కోరింది.