శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు: తితిదే అదనపు ఈవో - తిరుమలలో భక్తులకు సౌకర్యాలు
కొవిడ్ సంక్షోభం తొలగడంతో పెద్దసంఖ్యలో తిరుమలకు వస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట ప్రణాళిక రూపొందించామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వరుస సెలవులు, వేసవిలో వచ్చే భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ నెలాఖరుకు శ్రీవారి మెట్టును భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను ఆధునీకరిస్తున్నామన్నారు. దేశనలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం తితిదే తీసుకుంటున్న చర్యల పై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డితో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి.
తితిదే అదనపు ఈవో