కూరగాయల దాతలతో తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన కూరగాయల దాతలు హాజరయ్యారు. ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల కూరగాయల పంపాలని కోరిన ధర్మారెడ్డి.... 2004 నుంచి దాతల సహకారంతో భక్తులకు రుచికరమైన భోజనం పెడుతున్నారని తెలిపారు.
కూరగాయల దాతలతో తితిదే అదనపు ఈవో సమావేశం - కూరగాయల దాతలతో తితిదే అదనపు ఈవో భేటీ
ఏపీ, కర్ణాటక, తమిళనాడు కూరగాయల దాతలతో తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తిరుమలలో సమావేశమయ్యారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల కూరగాయలు పంపాలని దాతలను కోరారు. దాతలు అందించిన తాజా కూరగాయలతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదం అందిస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు.
![కూరగాయల దాతలతో తితిదే అదనపు ఈవో సమావేశం కూరగాయల దాతలతో తితిదే అదనపు ఈవో సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9148154-73-9148154-1602515789580.jpg)
కూరగాయల దాతలతో తితిదే అదనపు ఈవో సమావేశం
గతేడాది 18.57 లక్షల కిలోల కూరగాయలను దాతల నుంచి అందాయని ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది లాక్డౌన్ కారణంగా ఇప్పటి వరకు 1.65 లక్షల కిలోల కూరగాయల మాత్రమే విరాళంగా వచ్చాయన్నారు. దాతల సహకారంతో తాజా కూరగాయలు అన్నప్రసాదం ట్రస్టుకు వస్తున్నాయన్న అదనపు ఈవో దాతలను అభినందించారు.
ఇదీ చదవండి :మోటర్లకు మీటర్లతో.. రైతులపై భారం పడదు: సీఎం
Last Updated : Oct 12, 2020, 10:25 PM IST