ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రథసప్తమి వాహనసేవల్లో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విధులు నిర్వ‌హించాలి' - TTD Additional EO Latest news

ఉద్యోగులు, శ్రీ‌వారి సేవ‌కులు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విధులు నిర్వ‌హించాల‌ని... తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి సూచించారు. రథసప్తమి వాహనసేవల్లో సేవలందించేందుకు వచ్చిన డెప్యూటేషన్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు.

తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి
తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

By

Published : Feb 18, 2021, 7:37 PM IST

రథసప్తమి వాహనసేవల్లో సేవలందించేందుకు వచ్చిన డెప్యూటేషన్ సిబ్బందితో... తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయ మాఢవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని సూచించారు. ఉద్యోగులు, శ్రీ‌వారి సేవ‌కులు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విధులు నిర్వ‌హించాల‌ని కోరారు. కొవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాలని సూచించారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ... మాస్కులు ధ‌రించాల‌ని, భ‌క్తులు కూడా ధ‌రించేలా వివరించాలని విజ్ఞప్తి చేశారు.

గ్యాల‌రీల్లో వేచి ఉండే భ‌క్తులంద‌రికీ తాగునీటి బాటిల్ అందిస్తామ‌ని... అది ఖాళీ అవ‌గానే తిరిగి అక్క‌డే ఉన్న కొళాయిల్లోని జ‌ల‌ప్ర‌సాదం నీటిని నింపుకొనేలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ధర్మారెడ్డి సూచించారు. భక్తులందరికీ తాగునీరు, అన్న‌పానియాలు అందేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు స‌జావుగా జ‌రిగేలా చూడాల‌ని కోరారు. ఏవైనా స‌మ‌స్య‌లు ఎదురైతే అందుబాటులో ఉన్న అధికారుల‌ను వెంట‌నే సంప్ర‌దించి ప‌రిష్క‌రించాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details