'జలుబు, జ్వరం ఉన్నవాళ్లు తిరుమలకు రావొద్దు' - తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి
దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవాళ్లు తిరుమలకు రావొద్దని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి సూచించారు. కరోనా వ్యాప్తి చెందకుండా తితిదే అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. ఎన్నారై భక్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
'దగ్గు, జలబు, జ్వరం ఉన్నవాళ్లు తిరుమలకు రావొద్దు'
తిరుమలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తితిదే జాగ్రత్తలు పాటిస్తోంది. నిత్యం రసాయనాలతో శుభ్రపరచడంతో పాటు... దర్శనాల విషయంలో పలు ఆక్షలను విధించింది. తిరుమలకు వచ్చే భక్తులకు అలిపిరి తనిఖీ కేంద్రంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించటంతో పాటు... తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనలతో శ్రీవారి పుష్కరిణి మూసి వేసే విషయమై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు ధర్మారెడ్డి స్పష్టం చేశారు.