ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎవరు ఉల్లంఘిస్తే...వారే ప్రచారం చేయాలి - ఎవరు ఉల్లంఘిస్తే...వారే ప్రచారం చేయాలి

లాక్​డౌన్ ఉల్లంఘించిన వారితో ట్రాఫిక్ పోలీసులు విన్నూత్న కార్యక్రమం చేయిస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడితే జరిగే నష్టాలను వారే ప్రచారం చేయాలని ఆదేశించారు. అకతాయిలతోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

traffic-police-awareness-camp-in-tirumala
traffic-police-awareness-camp-in-tirumala

By

Published : Mar 28, 2020, 7:48 PM IST

ఎవరు ఉల్లంఘిస్తే...వారే ప్రచారం చేయాలి

కరోనా వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ను బేఖాతరు చేస్తూ రహదారులపైకి వస్తున్న వారితో తిరుపతి ట్రాఫిక్ పోలీసులు విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదేశాలను ఉల్లంఘిస్తూ వచ్చే పౌరులను నిలువరించి వారితో కరోనా వైరస్ బారిన పడితే జరిగే నష్టాలను ప్రచారం చేయించారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తిరిగితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆంక్షలను అతిక్రమిస్తున్న వారిపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తున్నారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో...ఈ తరహాలో అకతాయిలతోనే అవగాహన కార్యక్రమాలను నిర్వహించటాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details