తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి పనబాకలక్ష్మీ నామినేషన్ వేస్తుండటంతో ఆపార్టీ నేతలు పెద్దఎత్తున నెల్లూరుకు వెళ్తున్నారు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి అమర్నాధ్ రెడ్డిలు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో నెల్లూరు వెళ్తున్నారు.
తిరుపతి ఉపఎన్నికకు నేడు తెదేపా అభ్యర్థి నామినేషన్.. నెల్లూరుకు పార్టీ నేతలు - tirupathi by elections latest news
తిరుపతి ఉపఎన్నికకు నేడు తెదేపా అభ్యర్థి పనబాకలక్ష్మి నెల్లూరులో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ నేతలు నెల్లూరుకు వెళ్తున్నారు.
తిరుపతి ఉపఎన్నికకు తెదేపా అభ్యర్తి నామినేషన్.. నెల్లూరుకు పార్టీ నేతలు