- వరదలపై సీఎం జగన్ సమీక్ష.. బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలకు ఆదేశాలు
గోదావరి వరదలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పరిస్థితిపై.. ఆయా జిల్లాల ఉన్నతాధికారులు, ఐటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధిత ప్రాంతాల్లో తక్షణ వరద సాయం, పంట నష్టం అంచనా, ప్రస్తుత పరిస్థితిని ఆరా తీశారు.
- రెండు వారాల్లోగా ఆ నిధులు వెనక్కి ఇవ్వాలి.. ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
SUPREME COURT: ఎస్డీఆర్ఎఫ్ నిధుల మళ్లింపుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. పీడీ ఖాతాలకు మళ్లించిన నిధులను.. రెండు వారాల్లోగా వెనక్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- సాయం అందించాల్సిన నిధులు మళ్లించడమేంటి?: చంద్రబాబు
CBN fires on YSRCP: కొవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను దారి మళ్లించడమేంటని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. దారి మళ్లించిన నిధులను వెంటనే ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ చెయ్యాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి పాలనకు చెంపపెట్టు అని అన్నారు.
- కంటైనర్ కిందకు దూసుకెళ్లిన ఆటో.. అక్కడికక్కడే ఐదుగురు మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదానికి ఆటో రాంగ్ రూట్లో రావడమే కారణమని స్థానికులుంటున్నారు.
- రాష్ట్రపతి ఎన్నికల్లో 98.90% ఓటింగ్.. దిల్లీకి బ్యాలెట్ బాక్సులు!
Presidential election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో 98.90 శాతం ఓటింగ్ నమోదైంది. ఎనిమిది మంది ఎంపీలు ఓటు వేయలేదని అధికారులు తెలిపారు. మరోవైపు, బ్యాలెట్ బాక్సులను దిల్లీకి తరలిస్తున్నారు. సోమవారం రాత్రి నాటికే ఇవి పార్లమెంటుకు చేరుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు.
- నీట్ పరీక్షలో 'అక్రమాలు'.. రంగంలోకి సీబీఐ.. 8 మంది అరెస్ట్
వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షలో 'అక్రమాలకు' యత్నించిన 8 మందిని సీబీఐ అరెస్టు చేసింది. వీరిలో ప్రధాన సూత్రధారి కూడా ఉన్నట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే?
- '80'ని తాకిన రూపాయి.. 2014 తర్వాత 25% పతనం.. వారి కంటే బెటరే అన్న నిర్మల
Rupee Value: రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. శుక్రవారం కాస్త కోలుకున్న రూపాయి.. సోమవారం ఇంట్రాడేలో 80 మార్క్‌ను తాకింది. అనంతరం 15 పైసలు బలహీనపడి 79.98 వద్ద ముగిసింది. 2014 డిసెంబరు 31 నుంచి ఇప్పటివరకు రూపాయి విలువ 25 శాతం క్షీణించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో తెలిపారు.
- 'నా మామ, భార్య జోలికొస్తే..'.. వారికి రిషి స్ట్రాంగ్ కౌంటర్!
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో దూసుకుపోతున్న భారత మూలాలున్న రిషి సునాక్.. తన అత్తమామలైన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధా మూర్తి సాధించిన ఘనత పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని స్పష్టం చేశారు. తన మామ, భార్యపై వచ్చే తప్పుడు వార్తలను తిప్పికొట్టారు. 20 కోట్ల రూపాయల పన్ను తప్పించుకునే వీలున్నా.. తన భార్య స్పచ్ఛందంగా వదులుకున్నారని సునాక్ తెలిపారు.
- 'కోహ్లీ టైమ్ దొరికితే నా దగ్గరికి వచ్చేయ్.. అలా చేద్దాం'
ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న విరాట్ కోహ్లీ గురించి అతడి చిన్నప్పటి కోచ్ రాజ్ కుమార్ శర్మ స్పందించారు. కోహ్లీ ఆటలో ఎటువంటి సమస్య లేదని అన్నారు. కోహ్లీ తన దగ్గరకు మళ్లీ వస్తే.. తప్పిదాలపై తామిద్దరు కలిసి పనిచేస్తామని చెప్పారు
- నటి సురేఖ వాణి భావోద్వేగం.. భర్తతో గడిపిన చివరి క్షణాలను గుర్తుచేసుకుని..
Actress Surekha Emotional about her husband: యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నటి సురేఖ వాణి తెలుగులో తెరకెక్కిన 'భద్ర', 'దుబాయ్ శీను', 'బృందావనం', 'శ్రీమంతుడు', 'బొమ్మరిల్లు' చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉంటూ కుర్రహీరోయిన్లతో సమానంగా గ్లామర్ మెయిన్‌టెయిన్ చేస్తూ అదిరిపోయే ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ ప్రధాన వార్తలు
ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు
9pm