- High court: కోర్టు ధిక్కరణ కేసు.. ఇద్దరు ఐఏఎస్‌లకు శిక్ష ఖరారు చేయనున్న హైకోర్టు
కోర్టు ధిక్కరణ కేసులో.. సివిల్ ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య ,చిరంజీవి చౌదరిలకు హైకోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈనెల 29న శిక్ష ఖరారు చేస్తామని న్యాయస్థానం తెలిపింది. ఈరోజు హైకోర్టు విచారణకు పూనం మాలంకొండయ్య హాజరుకాకపోవటంతో.. నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసి.. ఈ నెల 29న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'సాక్షి'పై కోర్టు ధిక్కరణ కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ
‘సాక్షి’ మీడియాపై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పు వెల్లడించకముందే జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టివేసినట్లు గత నెల 24న సాక్షి మీడియా ట్వీట్ చేసిందని రఘురామ వాదించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- yanamala: ప్రభుత్వానికి 17 ప్రశ్నలు.. సంధించిన యనమల
వైకాపా ప్రభుత్వానికి తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు 17 ప్రశ్నలను సంధించారు. బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. బీసీ బ్యాక్‌లాక్ పోస్టుల భర్తీ ఏమైందని నిలదీశారు. మత్స్యకార సొసైటీలను ప్రభుత్వం నిర్వీర్యం చేయటం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Murder: ఆస్తి కోసం భార్యతో కలిసి తండ్రిని..
ఆస్తి విషయంలో కన్న తండ్రినే హత్యచేశాడో కిరాతకుడు. భార్యతో కలిసి తండ్రిని దారుణంగా హత్య చేసిన ఉదంతం.. విశాఖ జిల్లా సబ్బవరం మండలం టెక్కలిపాలెంలో జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'స్పుత్నిక్ లైట్' మూడోదశ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్.. దేశంలోని ఇతర రెండు డోసుల టీకాల కంటే సమర్థవంతంగా పనిచేస్తోందని లాన్సెట్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైన తరువాత డీసీజీఐ అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- చుట్టూ వరద నీరు.. చెట్టుకొమ్మపై వ్యక్తి.. చివరకు...
వరదల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని అగ్నిమాపక శాఖ(Fire Department) సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన ఒడిశా నయాగఢ్ జిల్లాలో(Odisha Nayagarh News) జరిగింది. నువాసాహస్పుర్ గ్రామానికి చెందిన కిశోర్ చంద్ర ప్రధాన్.. కుసుమీ నదిలో(Kusumi River) చేపలు పట్టేందుకు వెళ్లాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సొంత వీర్యంతో రోగులకు గర్భం- వైద్యుడి నిర్వాకం!
దాతల నుంచి సేకరించిన వీర్యం కాకుండా సొంత వీర్యాన్ని (Fertility Doctor using own sperm) ఉపయోగించి వైద్యుడు తన తల్లిని గర్భవతిని చేశాడని ఓ మహిళ ఆరోపించారు. దీనిపై కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రూ.2,999 ఈఎంఐతో ఓలా ఈ-స్కూటర్.. కొనేయండిలా...
దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి కంపెనీ వెబ్సైట్, ఓలా మొబైల్ యాప్ ద్వారా విక్రయాలు ప్రారంభమైనట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఈ స్కూటర్ల కొనుగోలు ప్రక్రియ, ఫినాన్స్ సదుపాయం ఎలా ఉపయోగించుకోవాలి అనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- IPL 2021: ఈ ప్లేయర్స్ ఇలా కనిపించి.. అలా వెళ్లిపోయారు!
ఐపీఎల్లో(IPL 2021 second phase ) ఆడేందుకు స్వదేశీ సహా విదేశీ క్రికెటర్లు ఎంతో తహతహలాడుతుంటారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తామేంటో నిరూపించుకోవాలనుకుంటారు. కానీ వారిలో కొంతమంది విఫలమైపోతుంటారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- త్వరలో 'ప్రేమదేశం' సీక్వెల్.. అభిమానుల్లో జోష్!
'ప్రేమదేశం'(Prema Desam Movie).. అప్పట్లో యువతను బాగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపును తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు కదిర్(Prema Desam movie Director). ప్రస్తుతం స్క్పిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.