ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. భక్తులకు అనుమతిపై సందిగ్ధత! - tirumala tirupati devasthanam latest news

నేటి నుంచి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే పుష్కరిణిలోనికి భక్తులను అనుమతించే విషయంలో సందిగ్ధత నెలకొంది.

tirumala
tirumala

By

Published : Mar 24, 2021, 9:16 AM IST

tirumala

తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలకు భక్తుల అనుమతిపై సందిగ్ధత నెలకొంది. తెప్పోత్సవాల నిర్వహణపై జరిగిన సమావేశంలో పుష్కరిణిలోకి భక్తులను అనుమతించాలని నిర్ణయించారు అధికారులు. నేటి నుంచి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం పుష్కరిణి వద్ద ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని బోర్డులను పెట్టారు. ఈ ఉదయం ఆ బోర్డులనూ తిరిగి తొలగించారు. ఇదే విషయంపై అధికారుల వివరణ కోరగా.. సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఫలితంగా భక్తుల్లో గందరగోళం నెలకొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details