తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం మంగళవారంతో ముగిసింది. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా, ప్రధాన పార్టీలతో పాటు మొత్తం 34 మంది నామినేషన్లు వేశారు. వీటిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్రధర్‌బాబు బుధవారం పరిశీలించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటిని స్వీకరిస్తారు. ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 17న లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తారు.
తిరుపతి ఉప ఎన్నిక: నేడు నామినేషన్ల పరిశీలన - తిరుపతి బైపోల్ 2021
తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. ఇవాళ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు.
![తిరుపతి ఉప ఎన్నిక: నేడు నామినేషన్ల పరిశీలన tirupati by poll 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11219730-564-11219730-1617150982593.jpg)
తిరుపతి ఉపఎన్నిక 2021