ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - today koil alwar thirumanjanam at tirumala news

తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పరిమళ జలంతో మందిరంలో సంప్రోక్షణం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

koil alwar thirumanjanam
కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

By

Published : Apr 6, 2021, 7:07 AM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నెల 13న ఉగాదిని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు. ఉదయం 11 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయశుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకుని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి వంటి అన్ని వస్తువులను శుద్ధి చేస్తారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

ABOUT THE AUTHOR

...view details