పురపాలక ఎన్నికల్లో...పోటీ చేసే తెదేపా అభ్యర్థులపై అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ అభ్యర్థులకు ధైర్యం చెప్పేందుకు జిల్లా పర్యటన చేపట్టారు. విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి చిత్తూరు వెళ్తారు.
ఉదయం 11 గంటలకు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. అధికార పార్టీ తీరుకు వ్యతిరేకంగా...దాదాపు 5 వేల మందితో దీక్ష చేపట్టాలని కార్యచరణ సిద్ధం చేశారు. చిత్తూరులో నిరసన దీక్ష ముగిసిన అనంతరం.. తిరుపతిలో పర్యటిస్తారు. అక్కడ మున్సిపల్ అధికారుల తీరుతో దుకాణం కోల్పోయిన తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి భర్త శ్రీనివాస్‌ను పరామర్శిస్తారు. అయితే రెండు చోట్ల పోలీసులు అనుమతి నిరాకరించడం ఇప్పుడు పర్యటనపై ఉత్కంఠతను పెంచుతోంది.
దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు