టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు శుక్రవారం తిరుపతిలో వినూత్న నిరసన చేపట్టారు. స్విమ్స్ కూడలిలో ప్లకార్డులతో ఆందోళన చేశారు. సంవత్సర కాలంలో వాలంటీర్ల అక్రమాలపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ప్లకార్డులపై అతికించి ప్రదర్శించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైన ఏడాది కాలంలో.. వాలంటీర్లు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ సమన్వయకర్త రవినాయుడు ఆరోపించారు. వాలంటీర్ల వ్యవస్థతో గ్రామస్వరాజ్యం తీసుకువస్తామని.. రౌడీరాజ్యం తెచ్చారంటూ నినాదాలు చేశారు.
వాలంటీర్ల వ్యవస్థపై వినూత్న రూపంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నిరసన - తిరుపతి టీఎన్‌ఎస్‌ఎఫ్ తాజా వార్తలు
తిరుపతిలో టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు వినూత్న నిరసన తెలియజేశారు. గ్రామస్వరాజ్యం ఎక్కడ ఉందని ప్రశ్నిస్తూ స్విమ్స్ కూడలి వద్ద ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తిరుపతిలో టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తల ఆందోళన