ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా వ్యాక్సిన్​తో ఎలాంటి సమస్యలు ఉండవు' - tmc commissioner ps girisha

కొవిడ్ వ్యాక్సిన్​ తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా అన్నారు. ఈ మేరకు టీఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాక్సిన్​పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా అవగాహన కల్పిస్తున్నారు.

tmc commissioner ps girisha
తిరుపతిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ

By

Published : Mar 27, 2021, 7:39 PM IST

తిరుపతిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా అన్నారు. కరోనా టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని.. వైద్యుల పర్యవేక్షణలో 45 ఏళ్ల పైబడిన వారంతా టీకా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు టీఎంసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్​పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు.

మాస్కు తప్పనిసరి..

కొవిడ్ కేసులు పెరుగుతున్నందున మాస్కులు ధరించటం తప్పనిసరి చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబందనలు పాటించాలన్నారు. మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నగరవాసులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి:

ప్రజలందరూ ఇళ్లల్లో ఉండి పండుగ జరుపుకోవాలి: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details