తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఆన్లైన్ ద్వారా జారీ చేసేవిధంగా చర్యలు చేపట్టామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వివాహం చేసుకునే జంటలకు ఉచితంగా బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు, మెట్టెలు,తిరుమల శ్రీవారి ప్రసాదాలు కానుకగా అందించే కార్యక్రమాన్ని శాసనసభ్యుడు చెవిరెడ్డితో కలిసి ఆయన తుమ్మలగుంటలో ప్రారంభించారు. వివాహం చేసుకోబోతున్న 7 జంటలకు కానుకలు అందించి ఆశీర్వదించారు
TTD: త్వరలోనే ఆన్‌లైన్‌లో సర్వదర్శన టోకెన్లు: తితిదే ఛైర్మన్
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు చర్యలు చేపట్టామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తాత్కాలికంగా ఆఫ్లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం జారీ చేస్తున్న రెండు వేల టోకెన్ల సంఖ్య మరింత పెంచేందుకు అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. సామాన్య భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతిలో రోజుకు రెండు వేల సర్వ దర్శనం టోకెన్ల జారీ చేస్తున్నామని తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సర్వ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. సుపథం ద్వారా దర్శనానికి కేటాయిస్తున్న సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో జారీకి సాంకేతికపరమైన సమస్యలు తలెత్తటంతో తాత్కాలికంగా ఆఫ్లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఇస్తున్న రెండు వేల టోకెన్ల సంఖ్యను మరింత పెంచేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి