ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Floods in Tirupati: తిరుపతికి తప్పని వరద.. ముంపులోనే పలు కాలనీలు

తిరుపతి నగరంలోని పలు కాలనీలు.. ఇంకా వరద ముంపులోనే(Floods in Tirupati) ఉన్నాయి. నగర సమీపంలోని పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువు నుంచి వరద కొనసాగుతోంది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Floods continue in Tirupati
తిరుపతిలో తప్పని వరద ముంపు

By

Published : Nov 22, 2021, 10:26 AM IST

తిరుపతిలో వరద ప్రభావం కొనసాగుతోంది. నగరంలోని పలు కాలనీలు.. ఇంకా వరద ముంపులోనే(Floods continue in Tirupati) ఉన్నాయి. నగర సమీపంలోని పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువు నుంచి వరద నీరు రావడంతో.. సరస్వతినగర్‌, గాయత్రీనగర్‌, శ్రీకృష్ణనగర్‌, ఉల్లిపట్టెడలో వరద కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలైన ఆటోనగర్‌, సంజయ్‌గాంధీ కాలనీలోకి వరద మట్టి పేరుకుపోయింది. దుర్గానగర్‌, యశోదనగర్‌, మధురానగర్‌ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది(Tirupati still in the grip of flood waters) పడుతున్నారు.

రాయలచెరువుకు గండిముప్పు పొంచిఉండటంతో పరిసర 19 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులకు తితిదే పద్మావతి వసతిగృహం, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో పునరావాసం కల్పించారు. రాయలచెరువు సమీపంలో ముంపు పరిస్థితిని ఆదివారం నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి..:Tirupathi Still in flood water : వరద నీటిలో తిరుపతి.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

ABOUT THE AUTHOR

...view details