ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయింది' - తెదేపానేత నరసింహ యాదవ్ వార్తలు

సీఎం జగన్ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని తెదేపా నేత నరసింహ యాదవ్ ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

narasimha yadav
తెదేపానేత నరసింహ యాదవ్

By

Published : Mar 20, 2021, 6:03 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే అవినీతి అక్రమాలు మితిమీరిపోయాయని తిరుపతి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ శ్రీకాళహస్తిలో అన్నారు. పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారాలు పెరిగాయని దుయ్యబట్టారు. వేల మందికి ఉపాధినిచ్చే పరిశ్రమలపై అధికార పార్టీ నేతలు పెత్తనం సాగిస్తున్న కారణంగా.. అవి మూతపడే స్థాయికి చేరుకున్నాయని వాపోయారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెడలు వంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న వైకాపా ఎంపీలు... గడచిన రెండేళ్ల కాలంలో సాధించింది ఏమీ లేదని దుయ్యబట్టారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిని గెలిపిస్తే అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details