సాంకేతిక లోపం కారణంగానే తిరుపతిలో రుయా కొవిడ్ ఆసుపత్రిలో 11 మంది రోగులు మరణించారని వైకాపా ఎంపీ గురుమూర్తి అన్నారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు చనిపోయిన వార్డలను ఆయన కలెక్టర్ హరినారాయణ్ తో కలిసి పరిశీలించారు.
సాంకేతిక లోపమే రుయా ఘటనకు కారణం: ఎంపీ గురుమూర్తి - రుయా ట్రాజెడీ వార్తలు
ఆక్సిజన్ అందక రోగులు చనిపోవటం బాధాకరమన్నారు.. వైకాపా ఎంపీ గురుమూర్తి. సాంకేతిక లోపం వల్లే తిరుపతి రుయా ఆస్పత్రిలో 11 మంది కొవిడ్ రోగులు మరణించారని తెలిపారు.
Tirupati MP Gurumurthi
ప్రాణవాయువు అందక రోగులు చనిపోవటం బాధాకరమని ఎంపీ గురుమూర్తి అన్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదనే సీఎం జగన్.. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. మృతుల వివరాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్న ఆయన.. జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామన్నారు. చనిపోయిన వారి వివరాలను వెల్లడించేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు.
ఇదీ చదవండి:'రుయా' ఘటనపై సీఎం సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం