ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బైపోల్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ - Tirupati by-election News

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 30 వరకు అవకాశం ఇచ్చింది. ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరపనున్నట్టు వెల్లడించింది.

బైపోల్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ
బైపోల్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ

By

Published : Mar 23, 2021, 5:26 PM IST

Updated : Mar 24, 2021, 4:38 AM IST

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 30 వరకు అవకాశం ఇచ్చింది. నామినేషన్ల పరిశీలనకు ఈనెల 31 వరకు అవకాశం ఉంది. ఉపసంహరణకు ఏప్రిల్ 3 వరకు అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ 17న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు జరపనున్నట్టు వెల్లడించింది.

మరోవైపు ప్రధాన పార్టీలన్నీ కదన రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నాయి. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి ఇవాళ నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. ఆమె పార్టీ కీలక నేతలతో కలిసి శాసనసభ నియోజకవర్గాల వారీగా శ్రేణులతో గత నాలుగు రోజులుగా భేటీ అవుతున్నారు. తిరుపతిలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నామినేషన్‌ దాఖలు చేశాక ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. వైకాపా తిరుపతిలో నేడు కీలక సమావేశం నిర్వహిస్తోంది. తితిదే అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఈ సమావేశానికి వైకాపా అభ్యర్థి గురుమూర్తి కూడా హాజరవుతారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పార్టీ అభ్యర్థితో కలిసి ఇవాళ ఉదయం ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

భాజపా నేతలంతా తిరుపతిలోనే మకాం పెట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కొన్ని రోజులుగా ఇక్కడే ఉండగా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి తిరుపతికి మంగళవారం చేరుకుని నేతలతో కలిసి ఎన్నికపై వ్యూహరచన చేశారు. నియోజకవర్గ నేతలతో భేటీ కావడంతో పాటు జనసేనతో సమన్వయం గురించి చర్చించారు. అభ్యర్థి ఎంపిక ఆలస్యంపై నేతల్లో అసంతృప్తిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావాలని సంకల్పించారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఓటెయ్యాలంటూ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చింతా మోహన్‌ ప్రచారం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ఎస్​ఈసీని ఆదేశించలేం: హైకోర్టు

Last Updated : Mar 24, 2021, 4:38 AM IST

ABOUT THE AUTHOR

...view details