తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శ్రీ నటరాజ స్వామివారికి ఆస్థానం జరిపించిన అర్చకులు.. శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. అనంతరం కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారికి.. స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.
శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు - kapileswara swami bramochavalu
తిరుపతిలోని కపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఆఖరి రోజు త్రిశూల స్నానం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను పండితులు నిర్వహించారు.
![శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు tirupathi kapileswara bramhochavalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10996252-582-10996252-1615646261356.jpg)
శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు