తిరుపతి జీవకోనలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. జీవకోన మిట్టపై ఉన్న ఓ గ్యాస్ గోదాంకి వెళ్లేందుకు... ఫుల్ లోడ్‌తో ఉన్న లారీ ప్రయత్నించగా..బ్రేక్ ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చేసింది. లారీని డ్రైవర్ అదుపుచేయలేక పోాయాడు. దీంతో అక్కడే ఉన్న ఆటో, ఓ తోపుడు బండి మీదకు లారీ రివర్స్ లో దూసుకెళ్లింది. ఫలితంగా లారీ కింద ఇరుక్కుని ఆటో, తోపుడు బండి పూర్తిగా ధ్వంసం అవటంతో పాటు ఓ వృద్దుడికి గాయాలయ్యాయి.
తృటిలో తప్పిన పెను ప్రమాదం! - తిరుపతి ప్రమాద వార్తలు
తిరుపతి జీవకోన మిట్టపై ఉన్న ఓ గ్యాస్ గోదాంకు వెళ్లేందుకు ప్రయత్నించిన లారీ బ్రేక్ ఫెయిల్ అయి వెనక్కి వచ్చి...ఆటోను, తోపుడు బండిను ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో ఓ వృద్ధుడికి గాయాలయ్యాయి. ట్రాన్స్ఫార్మర్కి కొన్ని అడుగుల దూరంలో గ్యాస్ సిలిండర్ లారీ నిలిచిపోవటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.
తృటిలో తప్పిన పెను ప్రమాదం
వాహనాలు అడ్డు తగలి.. ట్రాన్స్ఫార్మర్ కి కొన్ని అడుగుల దూరంలో గ్యాస్ సిలిండర్ లారీ నిలిచిపోవటంతో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ గోదాంను మిట్ట పై నుంచి తరలించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:ఆ ఖజానా ఎవరిది..!