తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న గరుడ వారధి పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీనివాసం వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. నిర్మాణాలు కూలటంతో భారీగా రాకపోకలు స్తంభించాయి. ప్రమాదస్థలిని మున్సిపల్ కమిషనర్ గిరీష పరిశీలించి ఘటన వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.
కూలిన తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్.. తప్పిన పెను ప్రమాదం - కూలిన తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్ వార్తలు
తిరుపతి స్మార్ట్‌సిటీలో భాగంగా నిర్మిస్తున్న గరుడ వారధి కూలిపోయింది. తితిదే శ్రీనివాసం భక్తుల సముదాయం సమీపంలో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కార్మికులు తృటిలో తప్పించుకున్నారు.
కూలిన తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్