తిరుపతిలోని కొవిడ్ ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ మాఫియా మితిమీరి ప్రవర్తిస్తోందంటూ.. అర్బన్ ఎస్పీ కార్యాలయంలో సీపీఎం నాయకులు ఫిర్యాదు చేశారు. ఎస్పీ వెంకటఅప్పలనాయుడును కలసిన సీపీఎం నేత కందారపు మురళి.. అంబులెన్స్ డ్రైవర్లు ప్రవర్తిస్తున్న తీరుతో రోగుల కుటుంబసభ్యులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.
రోగిని కిలోమీటరు తీసుకువెళ్లేందుకు, చనిపోతే మృతదేహాన్ని తరలిచేందుకు.. రూ.5 వేలకు పైగానే డిమాండ్ చేస్తున్నారని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పరిస్థితుల్లో కరోనా బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన కల్పించామని.. మరింత కట్టుదిట్టంగా ఆసుపత్రుల వద్ద పరిస్థితులు సమీక్షిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు మురళి తెలిపారు.