తిరుపతి నగర 892వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా.. మానవ వికాస వేదిక ఆధ్వర్యాన శోభాయాత్ర నిర్వహించారు. తితిదే జీయర్ స్వాములు వెంట రాగా.. వేద పండితుల మంత్రోఛ్చరణలు, భజన కీర్తనలు, మంగళ వాయిద్యాలు నడుమ గోవిందరాజ స్వామి ఆలయ మాఢవీధుల్లో ప్రదర్శన సాగింది.
అంతకుముందు గోవిందరాజస్వామి ఆలయంలో రామానుజాచార్యుల విగ్రహానికి పూజలు నిర్వహించారు. ప్రపంచంలో మరే ఇతర నగరాలకు లేని విధంగా తిరుపతికి మాత్రమే పుట్టినరోజు ఉండటం గర్వకారణమని.. ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి అన్నారు.