తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల రెండో తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగనుండటంతో, నెల్లూరు నగరంలోని డీ.కే.డబ్ల్యు కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలను తరలించారు. జిల్లా పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లోని ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో ఎన్నికల సిబ్బంది వీటిని తీసుకువచ్చారు. పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు.
స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంల తరలింపు.. - తిరుపతి తాజా వార్తలు
తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. నెల్లూరు జిల్లాలోని పలు నియోజక వర్గాల్లోని ఈవీఎంలను నెల్లూరు నగరంలోని డీ.కే.డబ్ల్యు కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూంలకు తరలించారు.
స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలు