వైకాపా, తెదేపా, కాంగ్రెస్, భాజపా, సీపీఎం వంటి ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు మరో ఏడు పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉండటం, 28మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో రెండు ఈవీఎంల ఏర్పాటు అనివార్యమవుతోంది. సాధారణంగా ఒక్కో యూనిట్లో నోటాతో సహా 16 ఎన్నికల గుర్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అభ్యర్థులు 28 మంది ఉండటంతో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 1022 పోలింగ్ కేంద్రాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి.
స్వతంత్రులే అధికం..
ప్రస్తుతం ఉప ఎన్నికకు నామపత్రాల దాఖలు గత నెల 30 తో ముగియగా 34 మంది నామినేషన్లు వేశారు. 31న పరిశీలనలో నాలుగింటిని తిరస్కరించగా, 30 మంది నిలిచారు. వారిలో సీపీఎం డమ్మీ అభ్యర్థితో పాటు, ఒక స్వతంత్య్ర అభ్యర్థి నామపత్రాలు ఉపసంహరించుకోవడంతో 28 మంది తుదిపోరుకు మిగిలారు. వారిలో 16 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉండటం గమనార్హం. గత ఎన్నికతో పోల్చితే వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది.