ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 9, 2021, 3:46 PM IST

ETV Bharat / city

కరోనా రోగులకు అన్నదానం.. కమిటీగా ఏర్పడి సాయం!

ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తే అంతకు మించిన పుణ్యఫలం ఉండదన్నారు పెద్దలు. సరిగ్గా ఆ మాటను సాకారం చేస్తున్నారు తిరుపతిలోని ఓ అపార్ట్‌మెంట్‌ వాసులు. కరోనా సోకి.. సరైన ఆహారం అందక పస్తులుంటున్న వారికి అన్నదానం చేస్తూ ఆత్మబంధువుల్లా ఆదుకుంటున్నారు.

కరోనా రోగులకు అన్నదానం.. కమిటీగా ఏర్పడి సాయం!
కరోనా రోగులకు అన్నదానం.. కమిటీగా ఏర్పడి సాయం!

కరోనా రోగులకు అన్నదానం.. కమిటీగా ఏర్పడి సాయం!

చిత్తూరు జిల్లాపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. పాజిటివ్ కేసులు నిత్యం వేల సంఖ్యలో వస్తున్నాయి. కొవిడ్‌ బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉంటున్న వారంతా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి బయటకి రాలేక.. అర్ధాకలితో కాలం గడుపుతున్నారు. వీరి బాధలను చూసి తిరుపతిలోని ఆర్కేడ్‌ అపార్ట్​మెంట్ వాసులు చలించారు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపేందుకు అంతా ఒక్కటై కదిలారు.

ఆర్కేడ్‌ అపార్ట్ మెంట్ వాసి కొండలరావు తొలుత కొవిడ్ బాధితులకు సాయం చేయాలని భావించారు. తన ఆలోచనను మిగిలిన అపార్ట్ మెంట్ వాసులతో పంచుకున్నారు. అందరూ కలిసి కొవిడ్‌ రోగులకు ఉచితంగా భోజనం అందించాలని నిర్ణయించారు. పాజిటివ్ వచ్చి హోం ఐసోలేషన్ లో ఉన్నవారు.. పాజిటివ్ రిపోర్ట్, ఇంటి అడ్రస్ వాట్సప్‌లో పెడితే.. మధ్యాహ్నం, రాత్రికి భోజనాన్ని వారికి పంపేలా ఏర్పాట్లు చేశారు. అలా మొత్తం 30 కుటుంబాలు కలిసి కొంతమొత్తం వేసుకుని సాయం చేస్తున్నాయి. పోషకాహారాన్ని స్వయంగా సిద్ధం చేసి రోగులకు అందిస్తున్నారు.

కొవిడ్‌తో బాధపడుతున్న రోగుల ఇంటికే నేరుగా భోజనం అందించడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అపార్ట్‌మెంట్‌ వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం తిరుపతికే పరిమితమైన తమ సేవలను త్వరలో రేణిగుంట, చంద్రగిరికి విస్తరిస్తామంటున్నారు.

ఇదీ చదవండి:

'రోజూ గోమూత్రం తాగితే కొవిడ్ నుంచి రక్ష'

ABOUT THE AUTHOR

...view details