నిబంధనల అతిక్రమణ, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా తెదేపా తలపెట్టిన ధర్మ పరిరక్షణ ప్రచార యాత్రను అనుమతి ఇవ్వలేదని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులపై తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలను ఎస్పీ ఖండించారు. కేవలం 100మందితో శాంతి యుతంగా ర్యాలీ నిర్వహించేదుకు అనుమతిచ్చామన్న ఎస్పీ.. మైక్సెట్లు, బైక్ ర్యాలీలతో తెదేపా నేతలు ఆధ్యాత్మిక వాతావరణంలో హడావిడి సృష్టించారన్నారు. కొవిడ్ నిబంధనలకు సైతం విఘాతం కలిగే అవకాశం ఉండటంతో తెదేపా నేతలను ఎక్కడిక్కడ అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు.
తెదేపా అలజడుల వల్లే.. ధర్మ పరిరక్షణ ప్రచార యాత్రకు అనుమతి నిరాకరణ: ఎస్పీ - dharma parirakshna yatra latest news
ఆధ్యాత్మిక తిరుపతి వాతావరణంలో మైక్సెట్లు, బైక్ ర్యాలీలతో తెదేపా నాయకులు అలజడులు సృష్టించడంతోనే ధర్మ పరిరక్షణ ప్రచార యాత్రకు అనుమతులు రద్దు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. శాంతి యుతంగా ర్యాలీ నిర్వహించేందుకు అనుమతిచ్చినా వాటిని అతిక్రమిచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అందుకే ర్యాలీని అనుమతి నిరాకరించినట్లు ఆయన స్పష్టం చేశారు.
తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి