మత సామరస్యానికి విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి హెచ్చరించారు. నగరంలోని తితిదే కోదండరామ స్వామి ఆలయాన్ని పరిశీలించిన ఆయన.... భద్రత గురించి అధికారులను ఆరా తీశారు. అనంతరం తిరుపతి వెస్ట్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
'మత సామరస్యానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు' - tirupathi police news
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైందన్నారు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి. మత సామరస్యానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
!['మత సామరస్యానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు' tirupathi urban sp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10317553-10-10317553-1611160111037.jpg)
'మత సామరస్యానికి విఘాతం కలిగిస్తే కఠినచర్యలే'
ప్రార్థనా మందిరాల భద్రతలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ఆయా గ్రామాల్లో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైందన్నారు. ముఖ్యంగా ప్రజలు వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని.. మొత్తం 608 ప్రార్థనా మందిరాల్లో 1624 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు.
ఇదీ చదవండి:పుత్తూరులో షాదీ మహల్ నిర్మాణానికి ఎమ్మెల్యే రోజా భూమి పూజ