తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన నరసింహయాదవ్ అన్నారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జ్గా తన పేరును ప్రకటించినందుకు నరసింహ యాదవ్... చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తెదేపా నేతలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. అధినేత ఆదేశాలను అనుసరిస్తూ... నియోజకవర్గంలో తెదేపా అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తానని నరసింహయాదవ్ తెలిపారు.
నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను: నరసింహయాదవ్ - తెదేపా నేత నరసింహయాదవ్ వార్తలు
తెదేపా అధినేత చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని.. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ అన్నారు. తనకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
నరసింహయాదవ్కు అబినందనలు తెలుపుతున్న నేతలు