తిరుపతి నగరపాలక సంస్థలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. నగరంలోని 50 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి మూడున నామినేషన్ల ఉపసంహరణ పూర్తవనుండగా.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఉపసంహరణ ఘట్టానికి ముందే ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంలోని 5వ వార్డులో వైకాపా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ తరఫున పోటీలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తుండగా.. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాలను తమ ప్రచార అస్త్రాలుగా మలచుకుంటున్నారు.
అభివృద్ధి పనులను వివరిస్తూ.. వైఫల్యాలను ఎండగడుతూ..!
తిరుపతి నగరపాలక సంస్థలో ఎన్నికల వేడి మొదలైంది. మొత్తం 50 వార్డులకు ఎన్నికలు జరగనుండగా.. ప్రచారం పర్వం ప్రారంభమైంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
అభివృద్ధి పనులను వివరిస్తూ .. వైఫల్యాలను ఎండగడుతూ