విశాఖ రైల్వే జోన్ పరిధిలో.. తిరుపతి, రేణిగుంట, తిరుచానూరు రైల్వే స్టేషన్లను కలిపి బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యను కోరారు. ఎంపీ.. రేణిగుంట రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిశారు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. తిరుపతి పడమర రైల్వే స్టేషన్ అభివృద్ధి, తిరుచానూరు నూతన రైల్వే స్టేషన్ పనులను వేగవంతం చేయడం, తిరుపతి రైల్వే స్టేషన్లో 6 ప్లాట్ ఫామ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతి ఎంపీ గురుమూర్తి.. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యను కలిశారు. తిరుపతి, రేణిగుంట, తిరుచానూరు రైల్వే స్టేషన్లను కలిపి బాలాజీ రైల్వైే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు.
దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి