తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలటంతో.. శుక్ర, శనివారాల్లో ఆలయాన్ని మూసేస్తున్నట్లు తితిదే తెలిపింది. దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసిన తరువాత ఆదివారం నుంచి యధావిథిగా తెరుస్తామని తెలిపారు.
ఉద్యోగికి కరోనా... గోవిందరాజస్వామి ఆలయం మూసివేత - తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం తాజా వార్తలు
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం 2 రోజులు మూసేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. ఆలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అవ్వటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గుడిని పూర్తిగా శానిటైజ్ చేసి ఆదివారం తిరిగి తెరుస్తామని తితిదే చెప్పింది.

గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి
తితిదే ఉద్యోగికి వేర్వేరు ఆరోగ్య సమస్యలు ఉండటంతో రెగ్యులర్ చెకప్‌కు వెళ్లగా.. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అతను విధులు నిర్వహించిన పాత హుజుర్ ఆఫీస్, పీహెచ్ స్టోర్‌ను శానిటైజ్ చేస్తున్నామని తితిదే అధికారులు చెప్పారు. ఆ ఉద్యోగి ప్రాథమిక కాంటాక్ట్స్ గురించి ఆరా తీస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి... శ్రీవారి సన్నిధిలో గొల్లలు కొనసాగింపు
Last Updated : Jun 12, 2020, 5:02 PM IST