నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు, సమయపాలనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ తిరుపతి డివిజన్ ఈఈ మహేంద్ర పేర్కొన్నారు. గృహనిర్మాణం పథకం అమలు, నాణ్యత పాటించడంలో ఏవిధమైన చర్యలు తీసుకోవాలి అనే అంశంపై తిరుపతి డివిజన్ పరిధిలోని గృహనిర్మాణశాఖకు చెందిన ఇంజినీర్లకు తిరుపతి ఐఐటి సమన్వయంతో శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈఈ మహేంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్లు నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 15 లక్షలు, రెండో విడతలో 15 లక్షలు ఇళ్లు లేఅవుట్ ద్వారా 282 చదరపు అడుగులతో మోడల్ హౌస్ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. ఇటువంటి శిక్షణా తరగతులు ఇంజినీర్లకు సాంకేతికంగా ఎంతో ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు.