Forest Officer Audio Viral: తిరుపతి జిల్లా సత్యవేడు అటవీశాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న గంగాధరం నెలవారీ మామూలు కోసం డిమాండ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. సత్యవేడు మండలం అలివేలు మంగాపురం గ్రామానికి చెందిన సంపూర్ణ అనే మహిళ.. కుమార్ అనే వ్యక్తి ఓ నెల రోజులపాటు కలప తరలించుకుంటాడని గంగాధరానికి ఫోన్ చేసి అనుమతి అడిగారు. అయితే.. వీఆర్‌వో అనుమతించినా, కలప తరలించడానికి వీలుకాదని.. తనకు ఏడు వేల రూపాయలు చెల్లిస్తే మాత్రం ఎలాంటి సమస్యలూ ఎదురుకాబోవంటూ హామీ ఇచ్చారు. ఇదే రీతిలో మరో నలుగురు మామూళ్లు ముట్టచెపుతున్నట్టు తెలిపారు. డబ్బులు చెల్లించకపోవడంతో అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని సంపూర్ణ చెబుతున్నారు.
"నాకు ఏడువేలిస్తే.. ఎలాంటి సమస్యా ఉండదు.." - Forest Officer Audio Viral
Forest Officer Audio Viral: తిరుపతి జిల్లా సత్యవేడు అటవీశాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న గంగాధరం నెలవారీ మామూలు కోసం డిమాండ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. కలప తరలించడానికి తనకు ఏడు వేల రూపాయలు చెల్లిస్తే.. ఎలాంటి సమస్యలూ ఎదురు కాబోవంటూ హామీ ఇచ్చినట్లుగా ఉన్న ఆ ఆడియో వైరల్ గా మారింది.
Forest Officer