ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఉపపోరు: ప్రచారంపై పార్టీల దృష్టి - తిరుపతి ఉపపోరు

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల పోరులో ఢీ కొట్టేదెవరో తేలిపోయింది. భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్​ రత్నప్రభను ప్రకటించడంతో...రేసులో నిలిచేదెవరో స్పష్టత వచ్చింది. ఇక పార్టీలన్నీ పూర్తిస్థాయి ప్రచారంపై దృష్టిసారించనున్నాయి.

ప్రచారంపై పార్టీల దృష్టి
ప్రచారంపై పార్టీల దృష్టి

By

Published : Mar 26, 2021, 5:29 AM IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో...భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థిత్వంపై మల్లగుల్లాలు పడిన కమలదళం చివరకు విశ్రాంత ఐఏఎస్ రత్నప్రభ పేరును అధికారికంగా ప్రకటించింది. గతంలో...కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా,ఐఏఎస్‌గా ఆమె అనుభవం.. ప్రజాసేవకు ఉపయోగపడుతుందని..భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు. 2017 -18లో కర్ణాటక సీఎస్​గా బాధ్యతలు నిర్వర్తించిన రత్నప్రభ 37 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని 2018 జూన్‌లో పదవి విరమణ చేశారు. అనంతరం కర్ణాటక సీఎం యడియూరప్ప సమక్షంలో 2019 ఏప్రిల్‌లో.. కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్‌గా ఉన్న రత్నప్రభ..త్వరలో నామినేషన్ వేయనున్నారు.

ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించిన వైకాపా,తెలుగుదేశం ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశాయి. వైకాపా అభ్యర్థి గురుమూర్తి.. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ యోజకవర్గాలవారీగా నేతలు,కార్యకర్తల్ని పరిచయం చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్‌,..ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తితో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిన తనను ఆశీర్వదించాలని కోరారు.

అందరికంటే ముందే నామినేషన్‌ వేసేసిన తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారంలోనూ అదే జోరు కనబరుస్తున్నారు. తిరుపతిలోని...తిమ్మినాయుడు పాళ్యంలో ఆమె ఓట్లు అభ్యర్థించారు. విభజన హామీల సాధనలో వైకాపా సర్కార్‌ విఫలమైందన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా.. బరిలోకి దిగుతున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదీచదవండి

తిరుపతి ఉపఎన్నిక: భాజపా-జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ రత్నప్రభ

ABOUT THE AUTHOR

...view details