తిరుపతి ఉప ఎన్నిక ప్రధాని మోదీ పాలనకు రెఫరెండమని కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ అన్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు.
సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక, మద్యం విక్రయాల్లో అక్రమాలకు పాల్పడి సంపాదించిన సొమ్మును తిరుపతి ఉపఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.