Tirumala Udayasthamana Tickets: సాధారణ రోజులో ఉదయాస్తమాన సేవా టిక్కెట్టు రూ.కోటి.. శుక్రవారం రోజున రూ.కోటిన్నరగా తితిదే పాలకమండలి నిర్ణయించింది. తితిదే వద్ద 531 ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టిక్కెట్లపై.. 25 సంవత్సరాల పాటు స్వామి వారి ఆర్జిత సేవలో పాల్గొనేందుకు భక్తులకు అవకాశం లభిస్తోంది. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు భక్తులు పాల్గొనే సౌలభ్యముంటుంది.
ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల కేటాయింపుతో.. తితిదేకు సుమారుగా రూ.600 కోట్లు ఆదాయం లభించే అవకాశముంది. వీటి ద్వారా లభించే మొత్తాన్ని.. చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించాలని.. పాలకమండలి నిర్ణయించింది. టిక్కెట్లు పారదర్శకంగా ఆన్ లైన్ ద్వారా కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు సభ్యులు తెలిపారు.