TTD Covid Restrictions:ఒమిక్రాన్, కొవిడ్ కేసుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. కొవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే భక్తులను తిరుమలకు అనుమతించనున్నట్లు తితిదే స్పష్టం చేసింది. .శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని కోరింది. నెగెటివ్ సర్టిఫికెట్ లేకుండా వస్తున్నవారిని అలిపిరి చెక్ పాయింట్ వద్దే నిలిపివేయనున్నట్లు తెలిపింది.
TTD Covid Restrictions: ఆ పత్రం ఉంటేనే.. తిరుమలకు భక్తుల అనుమతి: తితిదే - తిరుమల లెటేస్ట్ న్యూస్
TTD Covid Restrictions: కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు కఠినతరం చేస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ టీకా లేదా నెగెటివ్ పత్రం ఉంటేనే భక్తులను తిరుమలకు అనుమతించనున్నట్లు తితిదే స్పష్టం చేసింది.
![TTD Covid Restrictions: ఆ పత్రం ఉంటేనే.. తిరుమలకు భక్తుల అనుమతి: తితిదే ఆ పత్రం ఉంటేనే తిరుమలకు భక్తుల అనుమతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14000720-152-14000720-1640350684175.jpg)
ఆ పత్రం ఉంటేనే తిరుమలకు భక్తుల అనుమతి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు తితిదే ప్రకటించింది. భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్,సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలని కోరింది. తితిదేకు చెందిన ఇతర ఆలయాల్లో కూాడా భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని తితిదే అధికారులు కోరారు.
ఇదీ చదవండి :
Tirumala: శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. 80 నిమిషాల్లోనే ఖాళీ!
Last Updated : Dec 24, 2021, 7:12 PM IST