ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు ఆఫ్​లైన్​లో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ - tirumala srivaru on line tickets news

ఈ నెల 27వ తేదీకి సంబంధించిన శ్రీవారి సర్వదర్శన టోకెన్లను ఇవాళ ఉదయం తిరుపతిలోని నిర్ధిష్ట కేంద్రాల్లో జారీ చేయనున్నారు.

tirumala
నేడు ఆఫ్​లైన్​లో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ

By

Published : Jun 26, 2020, 4:30 AM IST

శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. గురువారం విడుదల చేసిన 18వేల ఆన్​లైన్​ టికెట్లు 4గంటల్లోనే అమ్ముడయిపోయాయి. తిరుమలకు ఈనెల 11నుంచి సామాన్యులను అనుమతించిన విషయం తెలిసిందే. ముందుగా ఆన్ లైన్ ద్వారా రోజుకు 3వేలు(ప్రత్యేక ప్రవేశ దర్శనం), ఆఫ్​లైన్ ద్వారా మరో 3వేలు(సర్వ దర్శనం)టోకెన్లు జారీ చేయాలని తితిదే అధికారులు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా అన్​లైన్​లో జూన్ నెల టికెట్లను ముందుగానే అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆ తర్వాత 19వ తేది నుంచి రోజుకు మరో 3వేల ఆన్ లైన్ టికెట్లు అదనంగా విడుదల చేశారు. ఆఫ్ లైన్ ద్వారా ఇస్తున్న టోకెన్లను ఈ నెల 26వ తేది వరకు జారీ చేశారు. తాజాగా మళ్లీ ఆన్​లైన్​లో రోజుకు 3వేల వంతున ఆరు రోజులకు 18వేల టికెట్లను గురువారం విడుదల చేయగా 4గంటల్లోనే అయిపోయాయి. అయితే టోకెన్ల జారీపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవటంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 27వ తేదీకి సంబంధించిన సర్వదర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం తిరుపతిలోని నిర్ధిష్ట కేంద్రాల్లో జారీ చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details