నిన్న శ్రీవారిని 8,300 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.26 లక్షలు ఆదాయం వచ్చింది. రోజుకు 6 వేలమంది భక్తులను దర్శనానికి అనుమతించాలని తితిదే నిర్ణయించింది. టిక్కెట్లు కలిగిన వారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తోంది. ఇవాళ సర్వదర్శనం టిక్కెట్ల కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల బారులు తీరారు. రేపటి కోటా ముగిసినా క్యూలైన్లలో భారీగా వేచి ఉన్నారు. రేపటి కోటాతో పాటు ఈ నెల 14 వరకు టోకెన్ల జారీకి తితిదే నిర్ణయించింది. విష్ణునివాసం, శ్రీనివాసం ప్రాంతంలోనూ దర్శన టోకెన్ల కోసం భక్తుల అధికంగా వేచి ఉన్నారు.
తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం - తిరుమలకు భక్తులు వార్తలు
ఇవాళ తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తోంది తితిదే. ఉదయం నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిబంధనలు పాటిస్తూ.. దర్శనానికి అనుమతిస్తున్నారు.
తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం