నిత్యకల్యాణం పచ్చతోరణంలా భక్తులతో కళకళలాడే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల... చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులు లేక వెలవెలబోతోంది. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. ఇదే సమయాన్ని తితిదే సిబ్బంది సద్వినియోగం చేసుకుంటున్నారు. తిరుమలను ఏడు ప్రాంతాలుగా విభజించి.. రోజూవారీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. మహాద్వారం మొదలుకొని పడికావలి, స్వామివారి సన్నిధి, క్యూలైన్లను మొత్తం శుభ్రపరుస్తున్నారు.
వెలవెలబోయిన తిరుమల క్షేత్రం.. శుభ్రపరుస్తున్న సిబ్బంది - తిరుమల తిరుపతి దేవస్థానం
భక్తజనసందోహం... గోవింద నామస్మరణలతో మారుమ్రోగే తిరుమల క్షేత్రం మూగబోయింది. నిత్యం భక్తులతో కళకళలాడే శ్రీవారి ఆలయం, తిరుమాఢ వీధులు వెలవెలబోయాయి. కిటకిటలాడే క్యూలైన్లు, అన్నదానభవనం, కల్యాణకట్టలు ప్రస్తుతం నిర్మానుష్యంగా మారాయి.

tirumala-temple-close
Last Updated : Mar 21, 2020, 11:59 AM IST