కరోనా వ్యాప్తి నివారణకు తితిదే ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు శ్రీవారి పుష్కరిణిని అధికారులు మూసివేశారు. భక్తులు పుష్కరిణి నీటితో స్నానమాచరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 18 స్నానపు గదులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తిరుమలలో శ్రీవారి పుష్కరిణి మూసివేత - తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత న్యూస్
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి పుష్కరిణిని మూసివేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మూసివేస్తామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
tirumala srivari pushkarini closed due to corona virus